Bigg Boss 7 Telugu : హౌస్‌మేట్స్‌ను బఫూన్స్ అన్న రతిక.. కంటతడిపెట్టిన అమర్‌దీప్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ హౌస్‌లో అస్త్రాల కోసం వేట మొదలైన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇచ్చిన టాస్కులు, కంటెస్టెంట్స్ తిప్పలతో షో చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ఇంటి సభ్యులను రణధీర, మహాబలి అనే జట్లుగా విభజించి టాస్క్‌లు ఇస్తున్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో రణధీర టీమ్ రెండు టాస్కుల్లో విజయం సాధించి రెండు కీ లను సొంతం చేసుకుంది. అయితే ఈ కీ లను కొట్టేయాలని మహాబలి టీమ్ సభ్యులు ప్రయత్నిస్తూ వినోదాన్ని అందిస్తున్నారు. అదే జట్టుకు చెందిన శుభశ్రీ ఏకంగా పవర్ అస్త్రను దొంగతనం చేసింది. అలాగే సెకండ్ టాస్క్ గెలిచిన రణధీర జట్టు సభ్యులు మాయా అస్త్రను సొంతం చేసుకున్నారు. ఇందులోని ఆరు చక్రాలను ఆరుగురు కంటెస్టెంట్స్ తీసుకున్నారు. అయితే వీరిలో చిచ్చు పెట్టేందుకు బిగ్‌బాస్ రెడీ అయ్యాడు.
అస్త్రం సాధించే అర్హత లేని వారి దగ్గరి నుంచి ఆ భాగాలు తీసుకుని అదే జట్టులోని మరో సభ్యుడికి ఇవ్వాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో శోభాశెట్టి నుంచి ఒక భాగాన్ని తీసుకున్న శుభశ్రీ దానిని ప్రిన్స్ యావర్‌కి అందించింది. అలాగే పల్లవి ప్రశాంత్.. అమర్‌దీప్ నుంచి శివాజీకి ఇచ్చాడు. ఈ క్రమంలో రతిక కోపంతో ఊగిపోయింది. అందరితో గొడవ పడుతూ నానా హంగామా సృష్టించింది. దామినిపై గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆమె కంటతడి పెట్టింది. ఇలాంటి టీమ్‌లో వున్నందుకు చాలా చండాలంగా వుంది, నా జట్టులో వున్నవాళ్లంతా బఫూన్స్ అంటూ రతిక నోరు పారేసుకుంది. రతిక హంగామాను గమనిస్తున్న సంచాలకుడిగా వ్యవహరిస్తున్న ఆట సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. షకీలా కూడా రతికపై సెటైర్లు వేయగా.. కెమెరా అటెన్షన్ కోసం ట్రై చేస్తున్నావా అంటూ రతిక ఎదురుదాడికి దిగింది.
వివాదం పెద్దదవుతూ వుండటంతో బిగ్‌బాస్ జోక్యం చేసుకున్నాడు. మహాబలి టీమ్ నుంచి ఎవరు రావాలి అనేది రణధీర జట్టు సభ్యులను డిసైడ్ చేయమన్నాడు. అంతేకాదు.. ప్రస్తుతం రణధీర జట్టులో ఎవరి చేతిలో అయితే మాయాస్త్రం లేదో వారు ఆటలో లేనట్లేనని ప్రకటించాడు. అంటే శోభాశెట్టి, ప్రియాంక, అమర్‌దీప్‌లు ఇక ఆటలో భాగం కానట్లే. దీంతో అమర్‌దీప్ ఊగిపోయాడు. రెండు రోజులు ఎంతో కష్టపడితే ఈ చిన్న కారణంతో తాను ఆటలో లేకపోవడంతో ఆయన కంటతడి పెట్టాడు.
ఇకపోతే.. రెండో వారం శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రశాంత్, షకీలా, శోభా శెట్టి, అమర్‌దీప్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, రతిక నామినేషన్స్‌లో ఉన్నారు. రెండు రోజుల్లో వీకెండ్ రాబోతూ వుండటంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments