Bigg Boss 7 Telugu : ఇకపై రతికను అక్కా అని పిలుస్తా.. షాకిచ్చిన రైతుబిడ్డ, ఈ వారం నామినేషన్స్‌లో ఎవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7లో నాలుగో వారం నామినేషన్స్ వాడి వాడిగా జరిగాయి. కంటెస్టెంట్స్ జ్యూరీ మెంబర్స్ (శివాజీ, శోభాశెట్టి, సందీప్)లను మెప్పించి నామినేషన్స్ తంతు ముగించారు. ఈ వారం జ్యూరీ సభ్యులు ఐదుగురిని నామినేట్ చేయగా.. బిగ్‌బాస్ మధ్యలో జోక్యం చేసుకుని తేజ, ప్రశాంత్, అమర్‌దీప్‌లలో ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని ఆదేశించాడు. దీంతో తేజని నామినేట్ చేస్తున్నట్లుగా వారు ప్రకటించారు. మొత్తంగా ఈ వారం ఆరుగురు నామినేషన్స్‌లో వున్నారు. ప్రియాంక, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, గౌతమ్, రతిక, తేజ నామినేట్ అయ్యారు.
అంతకుముందు ఇంట్లో పెద్ద గలాటా నడిచింది. ప్రిన్స్ యావర్‌ను నామినేట్ చేసిన ప్రశాంత్.. అతనికి యాటిట్యూడ్ ప్రాబ్లమ్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రిన్స్‌ను నామినేట్ చేయడానికి చెప్పిన కారణం బాలేదని జడ్జిలు ఒప్పుకోలేదు. యావర్‌కు శివాజీ సపోర్ట్ చేస్తున్నాడంటూ గౌతమ్ వాదించాడు. లాయర్‌లా ఓ వైపే మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యాడు. అక్కడితో ఆగకుండా చేతిలో వున్న గొడుగు విసిరేసి.. నువ్వేంత అని అరుస్తూ శివాజీ మీదకు దూసుకెళ్లాడు. అయితే గౌతమ్‌ని అమర్‌దీప్ అడ్డుకున్నాడు. దీంతో జ్యూరీ సభ్యులు.. ప్రిన్స్‌ని నామినేట్ చేశారు.
పల్లవి ప్రశాంత్, శుభశ్రీలను నామినేట్ చేశాడు అమర్‌దీప్. అయితే ప్రశాంత్‌కు రెండు ఫేస్‌లు వున్నాయని.. అసలైన ప్రశాంత్ బయటకు రావాలంటూ గతంలో చెప్పిన మాటలే మళ్లీ చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నేను మారను.. బరా బర్ ఇలాగే వుంటానని ప్రశాంత్ తేల్చిచెప్పాడు. అది నా ఇష్టం, నా ఆట నేను ఆడతా.. ఆడటానికి వచ్చాను. పల్లవి ప్రశాంత్ అనేవాడు ప్రపంచంలో ఒక్కడే వున్నాడని గట్టిగా అరిచి చెప్పాడు. అమర్‌దీప్ కూడా ఇలా వుంటాడని కౌంటర్ ఇచ్చాడు.
ఇక గతవారం తాను ఆడలేక తప్పుకున్నానని ఎత్తి చూపినందుకు శుభశ్రీని నామినేట్ చేస్తున్నట్లు అమర్‌దీప్ చెప్పాడు. అయితే తనను ఇలాంటి పాయింట్‌తో నామినేట్ చేయడం సరికాదని శుభశ్రీ వాదించింది. కానీ శుభశ్రీ, ప్రశాంత్‌లలో ఒకరినే సెలెక్ట్ చేయాలి కాబట్టి జ్యూరీ సభ్యులు శుభశ్రీని నామినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీనికి ఆమె బాగా హర్ట్ అయ్యింది. సిల్లీ రీజన్‌తో నామినేట్ చేయడం కరెక్ట్ కాదని కంటతడి పెట్టుకుంది. తర్వాత ప్రశాంత్.. గౌతమ్, అమర్‌దీప్‌ని బోనులో నిలబెట్టాడు. గత వారం నువ్వు గేమ్‌లో ముందుకు వెళ్లలేకపోవడం తనకు నచ్చలేదని అమర్‌దీప్‌ను నామినేట్ చేశాడు. అలాగే ఓ అమ్మాయి ముందు షర్ట్ తీసి షో హాఫ్ చేయడం బాలేదని గౌతమ్‌ని నామినేట్ చేశాడు. దీంతో వీరిద్దరిలో గౌతమ్‌ని జ్యూరీ సభ్యులు నామినేట్ చేశారు.
ఇవాళ్టీ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచిన ఇష్యూ రతిక , పల్లవి ప్రశాంత్‌లది. ప్రేమ పక్షులుగా మారుతారు భావిస్తున్న వేళ ఈ జంట ప్రేక్షకులకు షాకిచ్చింది. రతిక డ్రెస్సింగ్ గురించి ముందుగా గొడవ మొదలైంది. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని రతిక వార్నింగ్ ఇచ్చింది. అమ్మాయిని అని చూడకుండా నన్ను ఏయ్ అని పిలుస్తున్నాడని రీజన్ చెప్పింది. రతిక అని పేరు పెట్టి పిలవాలని లేదంటే అక్కా అనో, చెల్లి అనో పిలవమను అని సందీప్‌కు చెప్పింది. దీనికి బాగా హర్ట్ అయిన పల్లవి ప్రశాంత్. రేపటి నుంచి అక్కా, చెల్లి ఇలాగే పిలుస్తానని కుండబద్ధలు కొట్టేశాడు. శివాజీ ఆ గొడవను ఆపాడు. చివరికి రతికకు సారీ చెప్పడంతో పాటు ఇక మీదట తన పేరు ఎత్తితే చెప్పు తీసుకుని కొట్టు అంటూ కోపంతో చెప్పాడు ప్రశాంత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com