రథం ప్రీ రిలీజ్ ఈవెంట్..  

  • IndiaGlitz, [Wednesday,October 24 2018]

ఎ.వినోద్ సమర్పణలో రాజా దరపునేని నిర్మిస్తున్న చిత్రం రథం. గీతానంద్, చాందిని భగవాని హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి చంద్ర శేఖర్ కనూరి. ఈ చిత్రం ఈనెల 26న రిలీజ్ అవనుంది ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు. నటి ప్రమోదిని, దేవ్ రాజ్, నివ శర్మ, నరేన్, వినోద్, మాస్టర్ ఉజ్వల్ తదితరులు పాలొగొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాత రమేష్ పుప్పాల, ఎస్ గోపాల్ రెడ్డి, మధు, లు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో మొదట రమేష్ పుప్పాల మాట్లాడుతూ.. రథం చిత్ర నిర్మాత రాజా నాకు బాగా తెలుసు.. హీరో అవుతాడనుకున్నా ఇలా ప్రొడ్యూసర్ అయ్యారు. చాలా గొప్ప ప్రమోషన్ చేస్తున్నాడు. డైరెక్టర్ చంద్ర శేఖర్ కష్టం అంతా ట్రైలర్ లోనే కనపడుతోంది. ప్రేక్షలులు ఈ చిత్రానికి బ్రహ్మ రథం పడతారని ఆశిస్తున్నా.. టీమ్ అంతా మంచి ఉత్సాహం తో ఉన్నారు.. అందరికీ గొప్ప పేరు తెచ్చి పెట్టె చిత్రం అవుతుందని నమ్ముతున్న అని అన్నారు. మధు మాట్లాడుతూ కడపలో మా ఇంట్లోనే ఈ చిత్రం మొదలైంది.. నా చేయి మంచిదంటారు.. కనుక నా చేత్తో మొదలు పెట్టిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాదిస్తుందని ఆశిస్తున్నా అన్నారు.

ఈ చిత్ర నిర్మాత రాజా మాట్లాడుతూ.. ట్రైలర్, పాటలకే మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక సినిమా చూస్తే గూస్ బంబ్స్ వస్తాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి రేటుకు పోయింది అక్కడే ఈ చిత్ర సక్సెస్ కనపడుతోంది..ఈ నెల 26న గ్రాండ్ రిలీజ్ అవనుంది చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా.. ఈ రెండు రోజులు కూడా పేటిఎం లో కూడా ప్రమోషన్ ఉంటుంది.. ఈ చిత్రంలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ సెకండ్ ఛాన్స్ వస్తుందని నమ్మకంగా చెబుతున్నా.. సెన్సార్ వాళ్ళు ఈ సినిమా చూసి డైరెక్టర్ ను మెచ్చుకున్నారు. ప్రేక్షకులకు కూడా నచ్చి తీరుతుందని నా నమ్మకం అని చెప్పారు.

హీరో గీతానంద్ మాట్లాడుతూ.. నన్ను నమ్మి ఇంత మంచి సినిమా నాతో చేసిన టీమ్ అందరికీ నా కృతజ్ఞతలు. ప్రొడ్యూసర్ చాలా సపోర్టివ్. ఏ రోజుకూడా ఎవరిపైనా కోప్పడకుండా కూల్ గా సినిమా చేసుకుంటూ వెళ్లారు అయన. ఇక దర్శకుడు సినిమాను చించేసాడు అని చెప్పాలి. తన కష్టం మొత్తం కనపడుతుంది. హీరోయిన్ చాందిని హార్ట్ అండ్ సోల్ ఈ సినిమాకు అని చెప్పాలి. రొటీన్ కథ చూస్తున్నట్టు ఉండదు ఈ రథం చిత్రం. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎవరినీ డిస్సప్పాయింట్ చేయదు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని ఖచ్చితంగా చెప్పగలను అని అన్నారు.

హీరోయిన్ చాందిని మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి కష్టమే రథం. నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. నా కో యాక్టర్ ఈ చిత్ర హీరో గీతానంద్ చాలా కోపెరేటివ్. అంతే కష్టపడ్డాడు కూడా... చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాము అని చెప్పారు.

గీతానంద్, చాందిని, నరేన్, ప్రమోదిని, రాజ్ ముదిరాజ్, మిర్చి మాదవి, ఎన్ రామ్, మధుసూదన్ రెడ్డి, నరేంద్ర వర్మ, అభి, అయేషా. మాస్టర్ ఉజ్వల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సునీల్ కె ముత్యాల, ఎడిటర్: నాగేశ్వర రెడ్డి, మ్యూజిక్: సుకుమార్ పమ్మి, స్టెంట్స్: దేవరాజ్, కొరియోగ్రఫీ: చంద్రం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నివ శర్మ, డైరెక్టర్: చంద్ర శేఖర్ కానూరి, నిర్మాత: రాజా దరపునేని.

More News

సర్కార్‌ సంభాషణలకు రెస్పాన్స్‌ అదిరిపోతుంది: నిర్మాత

అతనొక కార్పొరేట్‌ మోన్స్టర్. అతను ఏ దేశం వెళ్లినా అక్కడ ఎదిరించిన వాళ్ళను అంతం చేస్తాడు. ఎలక్షన్ల కోసం ఇప్పుడతను ఇండియాకి వచ్చాడు.

 నవంబర్ 16న రానున్న'హుషారు'

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం  వేణుగోపాల్ ' మేము వయసుకు వచ్చాం'

దేశ‌దిమ్మ‌రి పాటలు విడుదల

త‌నీష్ హీరోగా స‌వీన క్రియేష‌న్స్ ప‌తాకంపై న‌గేష్ నార‌దాసి దర్శకత్వంలొ స్వతంత్ర గోయల్ (శావి USA) 'దేశ దిమ్మరి' చిత్రాన్ని  తెర‌కెక్కిస్తున్నారు.  

చ‌ర‌ణ్ సినిమాటోగ్రాఫ‌ర్ జంప్‌..?

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ మారిపోయాడా? అంటే అవున‌నే అంటున్నాయి సినీ వ‌ర్గాలు వివ‌రాల్లోకెళ్తే..

షారూక్ 'సారే జ‌హ‌సే అచ్చా'

ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తున్న త‌రుణంలో షారూక్ ఖాన్ ఓ బ‌యోపిక్‌లో న‌టించ‌బోతున్నారు. అది కూడా అంత‌రిక్షానికి చెందిన క‌థాంశం కావ‌డం విశేషం.