బీచ్‌లో రష్మిక.. తొలిసారి అంటూ..!
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడ చిత్రం ‘కిరిక్‌పార్టీ’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా, తదుపరి తెలుగులో ‘ఛలో’తో హీరోయిన్గా ప్రవేశం చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతోరష్మిక ఇమేజ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది ఏకంగా సూపర్‌స్టార్ మహేశ్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నటించి హిట్ కొట్టింది. ఇప్పుడు రామ్‌చరణ్‌తో ‘ఆచార్య’లో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప’లో అల్లుఅర్జున్‌తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఉన్న రష్మిక మందన్నాసోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది.
ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా సముద్ర తీరాన ఎక్సర్సైజులు చేసింది. దానికి సంబంధించిన వీడియోను తయారు చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘‘నేను చేసిన మొదటి బీచ్ వర్కవుట్ వీడియో ఇది. సముద్ర అలల శబ్దం, సముద్రం మట్టి వాసన, సూర్యాస్తమయం, నా పాదాల వ్యతిరేకంగా ఇసుక, ఇది ఎంతో అందంగా ఉంది. ఇక భవిష్యత్తులో ఇలాంటి వర్కవుట్ వీడియోను తయారు చేయాలని అనుకుంటున్నాను’’ అంటూ వీడియో పాటు మెసేజ్‌ను కూడా షేర్ చేసింది రష్మిక. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళంలోనూ కార్తితో సినిమా చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout