ర‌ష్మిక పాట‌.. మ‌హిళా సంఘాల ఆగ్ర‌హం

  • IndiaGlitz, [Monday,April 13 2020]

క‌న్న‌డ చిత్రం ‘కిరిక్‌పార్టీ’తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ర‌ష్మిక మంద‌న్న‌తెలుగులో ఛలో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద స‌క్సెసే అయ్యింది. ఒక ప‌క్క తెలుగు సినిమాలు, మ‌రో ప‌క్క క‌న్న‌డ సినిమాల్లో ర‌ష్మిక నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ధృవ సార్జా హీరోగా న‌టిస్తోన్న చిత్రం పొగ‌రు. ఈ సినిమాలో ర‌ష్మిక హీరోయిన్‌. ఆదివారం ఈ సినిమాలో ఓ పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అందులో హీరో అండ్ గ్యాంగ్ ర‌ష్మిక ఆట ప‌ట్టించే స‌న్నివేశాలున్నాయి. ఈ పాట‌పై ఇప్పుడు మ‌హిళా సంఘాలు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. ఓ అమ్మాయి టీజ్ చేసే సాంగ్‌ను ఇలా చిత్రీక‌రిస్తారా? అంటూ మ‌హిళా సంఘాలు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌పై ద‌య్య‌ప‌డుతున్నాయి. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గ‌గానే ఈ విష‌యంపై ఫిర్యాదు చేసే ఆలోచ‌న‌లోనూ మ‌హిళా సంఘాలున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ప్ర‌స్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఉన్న ర‌ష్మిక నితిన్‌తో భీష్మ‌, మ‌హేశ్‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాల్లో న‌టించింది ఈ రెండు సినిమాలు హిట్ కావ‌డంతో ఇప్పుడు బ‌న్నీ సినిమా 'పుఫ్ప‌'లోనూ న‌టిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల‌వుతుండ‌టం విశేషం. ఒక‌వేళ ఈ సినిమా భారీ విజ‌యాన్ని ద‌క్కించుకుంటే ర‌ష్మిక హీరోయిన్‌గా నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్న‌ట్లేన‌ని అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.

More News

సంక్రాంతి బ‌రిలో ‘ఆచార్య‌’..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

‘ఆర్ఆర్ఆర్’ విడుద‌ల వాయిదా.. రాజ‌మౌళి టార్గెట్ అప్పుడే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). ఇందులో

బ‌న్నీ చిత్రంలో క‌న్న‌డ స్టార్ హీరో ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల‌వుతుంది.

కరోనాపై పోరుకు ఏపీలో ‘డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసన్‌‌’...

కోవిడ్‌ –19 నివారణా చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసన్‌‌ను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసిన్‌

కరోనా నేపథ్యంలోనూ విజయసాయి వర్సెస్ మెగా బ్రదర్

కరోనా మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయాలు ఆగట్లేదు. తమ వంతు సాయం చేసి పేదలను.. కరోనా బాధితులను ఆదుకోవాల్సిన నేతలు విమర్శలు