మాజీ లవర్‌కు షాకిచ్చేసిందిగా..!
- IndiaGlitz, [Tuesday,September 18 2018]
రష్మిక.. హీరో రక్షిత్ ఎంగేజ్మెంట్ రీసెంట్గా బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్గా తన పని తనను చేసుకోవాల్సిందిగా.. డిస్ట్రబ్ చేయవద్దని రక్షిత్ సహా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిని రష్మిక కోరింది. అంతే కాకుండా రక్షిత్ నెక్స్ట్ మూవీ వ్రిత్రా నుండి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
కెరీర్ ప్రారంభంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ తప్పడం లేదు. దర్శక నిర్మాతలకు నా నిర్ణయం చెప్పాను. వారు అర్థం చేసుకున్నారు. నా స్థానంలో వచ్చే హీరోయిన్ నా కంటే బాగా నటించాలని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అంటూ మెసేజ్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది రష్మిక.