సొంతంగా డబ్బింగ్...
Send us your feedback to audioarticles@vaarta.com
`ఛలో`తో హిట్ అందుకున్న రష్మిక తాజాగా విడుదలైన `గీత గోవిందం`తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండతోనే `డియర్ కామ్రేడ్` లో నటిస్తుంది. అలాగే మరోవైపు నాగార్జున,నాని మల్టీస్టారర్ `దేవదాస్` పూర్తి చేసేసింది.
ఈ సినిమాలో నాని జోడిగా రష్మిక కనిపించనుంది. అయితే ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా డబ్బింగ్ జరుగుతుంది. రష్మిక తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటుండటం విశేషం. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com