ఆధారాలు కావాలంటున్న రష్మిక
Send us your feedback to audioarticles@vaarta.com
ఛలోతో తెలుగులో సక్సెస్ కొట్టి.. గీతగోవిందంతో స్టార్ డమ్ దక్కించుకున్న రష్మిక ఇప్పుడు తెలుగులో డియర్ కామ్రేడ్‌తో పాటు వెంకీ కుడుముల చిత్రంలో నటించనుంది. కన్నడంలో ఇప్పటి వరకు చేసిన కమిట్ మెంట్స్‌ను పూర్తి చేసింది. కొత్త కన్నడ సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు. దీంతో రష్మిక మందన్నాపై శాండీవుడ్ కోపంగా ఉందని వార్తలు పుట్టుకొచ్చాయి.
అయితే దీనిపై తన ట్విట్టర్ ద్వారా స్పందించింది రష్మిక. ``ఇలాంటి వార్తలను ఎవరు చెప్పారు? తప్పుగా తీసుకోవద్దు. ఏదైనా ఉంటే నాకే మెసేజ్ చేయండి. ఇండస్ట్రీకి నాపై కోపం ఉందంటే నేను నమ్మను. నాకు ఆధారాలు కావాలి. ఇవ్వండి.. ఇవ్వండి.. డైరెక్ట్‌గా నాకే మెసేజ్ ఇవ్వండి`` అంటూ మెసేజ్ పోస్ట్ చేసింది రష్మిక మందన్నా..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com