Rashmika:రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన అమితాబ్ బచ్చన్..
- IndiaGlitz, [Monday,November 06 2023]
'పుష్ప' సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్నా(Rashmika Mandanna).. తాజాగా 'పుష్ప-2', 'యానిమల్' వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని రష్మిక లిఫ్ట్‌లోకి వచ్చినట్లు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రష్మిక ఏంటి ఇలా ఎక్స్‌పోజింగ్ చేస్తుందంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ కాగా.. ఇది ఫేక్ వీడియో అని తేలింది.
జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్‌కి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియోలో జారా ఫేస్ బదులు రష్మిక ఫేస్ పెట్టి మార్ఫింగ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. కొంతమంది నెటిజన్లు ఇది మార్ఫింగ్ వీడియో అని చెబుతూ ఒరిజనల్ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో రష్మిక అభిమానులు, నెటిజన్లు ఈ వీడియో క్రియేట్ చేసిన వారిపై మండిపడుతున్నారు. దీనిపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రష్మిక మార్ఫింగ్ వీడియో వివాదంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ కొన్ని చట్టపరమైన బాధ్యతలను పాటించాల్సి ఉంటుందన్నారు. తమ మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే వెంటనే గుర్తించి 36 గంటల్లోగా తొలగించాలని తెలిపారు. లేని పక్షంలో ఆ సామాజిక మాధ్యమాలు కోర్టుల్లో లీగల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మార్ఫింగ్ వీడియోల కట్టడి సోషల్ మీడియా బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
yes this is a strong case for legal https://t.co/wHJl7PSYPN
— Amitabh Bachchan (@SrBachchan) November 5, 2023