Rashmika:నాలా ఎంతో మంది భయపడుతున్నారు.. డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన రష్మిక..
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తన మార్ఫింగ్ వీడియోపై హీరోయిన్ రష్మిక మందన్నా స్పందించారు. ‘‘ఆన్లైన్లో వైరల్ అవుతోన్న నా డీప్‌ఫేక్ గురించి మాట్లాడటానికి ఎంతో బాధపడుతున్నా. టెక్నాలజీ తప్పుగా ఉపయోగించడం వల్ల నాలా ఎంతోమంది భయపడుతున్నారు. ఇదే ఘటన నేను కాలేజీ లేదా స్కూల్లో చదువుతున్న రోజుల్లో జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఊహించలేనన్నారు. ఒక మహిళగా అందులోనూ నటిగా నన్నెంతగానో సపోర్ట్ చేస్తున్న కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. అలాగే మన గుర్తింపునకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలపై కలసికట్టుగా తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది’’ అని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..?
రష్మికకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని రష్మిక లిఫ్ట్‌లోకి వచ్చినట్లు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రష్మిక ఏంటి ఇలా ఎక్స్పోజింగ్ చేస్తుందంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ కాగా.. ఇది ఫేక్ వీడియో అని తేలింది. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్కి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియోలో జారా ఫేస్ బదులు రష్మిక ఫేస్ పెట్టి మార్ఫింగ్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ఐటీ శాఖ స్పందన..
రష్మిక మార్ఫింగ్ వీడియో వివాదంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ కొన్ని చట్టపరమైన బాధ్యతలను పాటించాల్సి ఉంటుందన్నారు. తమ మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే వెంటనే గుర్తించి 36 గంటల్లోగా తొలగించాలని తెలిపారు. లేని పక్షంలో ఆ సామాజిక మాధ్యమాలు కోర్టుల్లో లీగల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మార్ఫింగ్ వీడియోల కట్టడి సోషల్ మీడియా బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
PM @narendramodi ji's Govt is committed to ensuring Safety and Trust of all DigitalNagriks using Internet
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) November 6, 2023
Under the IT rules notified in April, 2023 - it is a legal obligation for platforms to
➡️ensure no misinformation is posted by any user AND
➡️ensure that when reported by… https://t.co/IlLlKEOjtd
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout