ఆమెను మ‌రోసారి విల‌క్ష‌ణ పాత్ర‌లో ప్రెజెంట్ చేయ‌నున్న సుకుమార్‌

  • IndiaGlitz, [Sunday,January 19 2020]

'రంగ‌స్థ‌లం' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత డైరెక్ట‌ర్ సుకుమార్ మ‌రో సినిమాను తెర‌కెక్కించ‌లేదు. బ‌న్నీతో సినిమా చేయ‌డానికి ఎదురు చూస్తున్నాడు. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. చిత్తూరు జిల్లా ఎర్ర‌చంద‌నం బ్యాక్‌డ్రాప్‌లో సుక్కు ఈ సినిమాను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేసేసుకున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. కాగా.. 'రంగ‌స్థ‌లం' చిత్రంలో రంగ‌మత్త పాత్ర‌లో మెప్పించిన అన‌సూయ‌ను బ‌న్నీ చిత్రంలో న‌టింప చేస్తున్నాడు. ఆమె కోసం మ‌రో డిఫ‌రెంట్‌రోల్ క్రియేట్ చేశాడ‌ట సుక్కు. ఫిబ్ర‌వ‌రి నుండి అన‌సూయ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంద‌ట‌. కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్నాడు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నాడు.

ఈ సంక్రాంతికి విడుద‌లైన 'అల వైకుంఠ‌పుర‌ములో' స‌క్సెస్ త‌ర్వాత బ‌న్నీ న‌టిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు నెల‌కొన్నాయి.

More News

బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న డ‌స్కీ బ్యూటీ..ఎవ‌రితో జ‌త క‌డుతుందో తెలుసా?

టాలీవుడ్‌లో అంతంత మాత్రంగా అవ‌కాశాల‌తో స‌త‌మ‌వుతూ వ‌చ్చిన డ‌స్కీ బ్యూటీ ఈషారెబ్బాకు పెద్ద అవ‌కాశ‌మే ద‌క్కింది.

`RRR` విడుద‌ల తేదీపై రాజ‌మౌళి తెలివిగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడా?

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `RRR`. `బాహుబ‌లి` వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం

గోవాలో సొంతిల్లు.. సమంత కోరిక ఇదేనట!

సొంతిల్లు అంటే ఎవరికైనా మక్కువే. జీవితకాలంలో తనకంటూ ఓ ఇల్లు ఉండాలని ఎవరైనా భావిస్తుంటారు.

జగన్ పిలిచి పదవి ఇస్తానంటే.. పోసాని చెప్పిన మాటేంటో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో పోసాని కృష్ణమురళీ ఎంత పాపులరో అందరికీ తెలిసిన విషయమే. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఆయన విలక్షణమైన పాత్రలను పోషించారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు బర్త్ డే సెలబ్రేషన్

దాదాపు 350కిపైగా చిత్రాల్లో నటించి.. సినీప్రియుల మదిలో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకోవడమే కాక, నిర్మాతగానూ పదుల సంఖ్యలో హిట్‌ చిత్రాలు నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు