ఆమెను మరోసారి విలక్షణ పాత్రలో ప్రెజెంట్ చేయనున్న సుకుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
`రంగస్థలం` వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ సుకుమార్ మరో సినిమాను తెరకెక్కించలేదు. బన్నీతో సినిమా చేయడానికి ఎదురు చూస్తున్నాడు. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. చిత్తూరు జిల్లా ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో సుక్కు ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసేసుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా.. `రంగస్థలం` చిత్రంలో రంగమత్త పాత్రలో మెప్పించిన అనసూయను బన్నీ చిత్రంలో నటింప చేస్తున్నాడు. ఆమె కోసం మరో డిఫరెంట్‌రోల్ క్రియేట్ చేశాడట సుక్కు. ఫిబ్రవరి నుండి అనసూయ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుందట. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
ఈ సంక్రాంతికి విడుదలైన `అల వైకుంఠపురములో` సక్సెస్ తర్వాత బన్నీ నటిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com