విజయ్ దేవరకొండ తో రష్మిక మండన్నా
Send us your feedback to audioarticles@vaarta.com
2016 లో వరుసగా " సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, ధృవ " లాంటి హ్యట్రిక్ సూపర్‌హిట్స్ తో దూసుకుపోతున్న గీతాఆర్ట్స్ కి అనుభంద సంస్థ గా GA 2 బ్యానర్ లో భలేభలేమగాడివోయ్ లాంటి చిత్రం తరువాత నిర్మాత బన్నివాసు మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గీతాఆర్ట్స్ బ్యానర్ లో మంచి కమర్షియల్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా విజయాన్ని సాధించిన' శ్రీరస్తు శుభమస్తు' దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
ఇటీవల కాలంలో చిన్నచిత్రంగా విడుదలయ్యి ట్రెండింగ్ సక్సస్ ని సొంతం చేసుకున్న అర్జున్ రెడ్డి చిత్రంతో అందరి అభిమానాన్ని గెలుచుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. బన్ని వాసు నిర్మాతగా నాగచైతన్య తో '100%లవ్', సాయిధరమ్‌తేజ్ తో 'పిల్లా నువ్వులేని జీవితం', నాని తో 'భలే భలే మగాడివోయ్' ఇప్పడు విజయ్ దేవరకొండ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా ఎంపికైంది. కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న రష్మిక... కిరాక్ పార్టీ చిత్రంతో అందరి మనసుల్ని దోచుకుంది. అందం అభినయంతో ఆకట్టుకున్న రష్మిక విజయ్ దేవర కొండ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం విశేషం.
త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com