బ‌న్నితో ర‌ష్మిక‌

  • IndiaGlitz, [Tuesday,January 08 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌దుప‌రి చిత్రాన్ని త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. నెల‌లో ప్రారంభం కాబోయే ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇంత‌కు ముందు ఈ చిత్రంలో హీరోయిన్‌గా కైరా అద్వానీని తీసుకోవాల‌ని నిర్మాత‌లు యోచిస్తున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

కాగా, ఇప్పుడు ఆ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో 'గీతగోవిందం' సినిమాలో ర‌ష్మిక న‌టించింది. ఇప్పుడు ఆమెను సినిమాలోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. గీతాఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై సినిమా నిర్మితం కానుంది.