స్టన్నింగ్ హాట్: పర్పుల్ డ్రెస్ లో మతిపోగొడుతున్న రష్మిక
Send us your feedback to audioarticles@vaarta.com
సౌత్ లో రష్మిక మందన తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక.. క్యూట్ యాక్టింగ్, గ్లామర్ తో యువతలో క్రేజ్ తెచ్చుకుంది. వరుస విజయాలు కూడా దక్కడంతో హీరోయిన్ గా టాప్ లీగ్ లోకి చేరిపోయింది. ప్రస్తుతం రష్మిక స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.
ఇదీ చదవండి: 100 మిలియన్ల 'ఎల్లువొచ్చి గోదారమ్మ'.. పూజా హెగ్డే రెస్పాన్స్ చూశారా..
తాజాగా రష్మిక తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పిక్ పోస్ట్ చేసింది. పర్పుల్ డ్రెస్ లో మతిపోగోట్టే హాట్ నెస్ తో ఉన్న ఆ పిక్ వైరల్ గా మారింది. రష్మిక ధరించిన పర్పుల్ స్లిప్ డ్రెస్ విభిన్నంగా ఉంది. ఈ డ్రెస్ లో రష్మిక అందాలు ఆరబోస్తుంటే నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
రష్మిక ఈ పిక్ పోస్ట్ చేసి 24 గంటలు గడవక ముందే 32 లక్షల మంది లైక్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. రష్మిక కూర్చున్న ఫోజు, స్టైల్ ప్రతి ఒక్క అంశం చూపుతిప్పలేని విధంగా ఉన్నాయి. ఈ పిక్ కి రష్మిక ఇంట్రెసింగ్ క్యాప్షన్ పెట్టింది. 'పెద్ద పనులు చేయబోయే అమ్మాయి.. చిన్న విషయాలని పట్టించుకోదు.. ఇది నాకు బాగా రిలేట్ అవుతుంది' అని రష్మిక కామెంట్ చేసింది.
ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటిస్తోంది. అలాగే హిందీలో 'మిషన్ మజ్ను' అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఛలో, గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు లాంటి హిట్స్ రష్మిక ఖాతాలో ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments