తన పెట్ తో ముంబయిలో కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన రష్మిక!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక ఇక బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టేందుకు ఆమె కొత్త జర్నీ ప్రారంభించింది. అదేంటంటే.. రష్మిక ఇటీవల ముంబయిలో అపార్ట్మెంట్ లో కొత్త ఇల్లు తీసుకుంది.
తాజాగా రక్ష్మిక ఆ ఇంటికి షిఫ్ట్ అయింది. ఈ సంగతిని రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో క్యూట్ పిక్ తో తెలిపింది. రష్మిక తన పెంపుడు కుక్క 'ఔరా'తో కలసి కొత్త ఇంటికి షిప్ట్ అయ్యిందట. సోఫాలో తన కుక్కతో ఉన్న టీజింగ్ పిక్ ని రష్మిక షేర్ చేసింది.
'డియర్ డైరీ.. ఈ రోజు చాలా జరిగింది. కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం. షాపింగ్ చేసి చాలా వస్తువులు కొన్నాం. ఇంకా పూర్తి కాలేదు. బాగా అలసిపోయి సోఫాలో కూర్చుని నేను, ఔరా నిద్రపోతున్నాం' అని రష్మిక కామెంట్ పెట్టింది.
రష్మిక ఇటీవలే 'గుడ్ బై' చిత్ర షూటింగ్ కోసం ముంబయికి వచ్చింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగులో అల్లు అర్జున్ సరసన 'పుష్ప' చిత్రంలో నటిస్తోంది. రష్మిక చివరగా 'సుల్తాన్' చిత్రంలో మెరిసింది.
ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు లాంటి విజయాలు ఆమె ఖాతాలో పడ్డాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments