Pushpa 2 :‘పుష్ప2‘ సెట్ ఫోటోను షేర్ చేసిన రష్మిక.. సోషల్ మీడియాలో వైరల్

  • IndiaGlitz, [Friday,September 08 2023]

జాతీయ అవార్డ్ గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప 2. శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ను నిర్వహిస్తోంది యూనిట్. పుష్ప ది రైజింగ్‌కు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని మేకర్స్ పార్ట్ 2ని తెరకెక్కిస్తున్నారు. దీనికి తోడు రీసెంట్‌గా అల్లు అర్జున్ ఏకంగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్‌ను కైవసం చేసుకోవడంతో పుష్ప 2పై భారీ అంచనాలున్నాయి.

పుష్ప 2 నుంచి అప్‌డేట్స్ వచ్చి చాలాకాలం అవుతోంది. దీంతో కొత్త అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ హీరోయిన్ రష్మిక మందన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఓ భారీ సెట్‌కు సంబంధించిన ఫోటో వుంది. ఇక్కడే రష్మిక, బన్నీల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సెట్ వేసినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా.. తాజా షెడ్యూల్‌ను కూడా త్వరగా కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. తొలుత ఈ ఏడాది చివరి నాటికి పుష్ప 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే ఈ సినిమాపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఇటీవల ‘‘బేబీ’’ మూవీ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్.. తన స్పీచ్ ముగుస్తుందనగా ‘పుష్ప 2’లోని డైలాగ్ కావాలంటూ ఫ్యాన్స్ గోల చేయడంతో వారి కోరికను మన్నించి ఓ డైలాగ్ వదిలారు . ‘‘ ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండాది.. పుష్పాగాడి రూల్'' అంటూ బన్నీ చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్‌తో ఫ్యాన్స్ ఈలలు, కేకలు పెట్టారు. పుష్ప 2లో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. అనసూయ, సునీల్ , జగపతి బాబు, జగదీష్ ప్రతాప్ భండారి, ప్రకాష్ రాజ్, రావు రమేష్ , అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More News

Chandramukhi 2:సెప్టెంబర్ 28న రాఘవ లారెన్స్, ‘చంద్రముఖి 2’ రిలీజ్

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో

ఏపీ విద్యా విధానం భేష్.. ఇలాంటి సంస్కరణలే కావాలి , జగన్‌పై నోబెల్ అవార్డ్ గ్రహీత ప్రశంసలు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అభివృద్ధి శూన్యం, పారిశ్రామిక రంగం నాశనం అంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం కొనసాగిస్తోంది.

Bigg Boss 7 Telugu : బొక్కలో బిగ్‌బాస్.. గేట్లు తీస్తే వెళ్లిపోతా, కాఫీ కోసం శివాజీ రచ్చ

బిగ్‌బాస్ హౌస్‌లో ఈసారి అన్నీ మార్చేశాం.. ఉల్టా పల్టా సీజన్ అని చెప్పారు నిర్వాహకులు. కంటెస్టెంట్స్‌ని కూడా మార్చేశామని చెప్పారు.

Rudramkota:సెప్టెంబ‌ర్ 22న 'రుద్రంకోట‌' విడుద‌ల‌

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హిరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `రుద్రంకోట‌`.

Bigg Boss Telugu 7 : ‘‘కుస్తీ’’మే సవాల్ అన్న కంటెస్టెంట్స్.. ఆ ఇద్దరూ ఫైనల్‌కి, టేస్టీ తేజాకి షకీలా ముద్దు

నామినేషన్ల పర్వం ముగియడంతో హౌస్‌లో పులిహోర కలిపే కార్యక్రమాలు మొదలయ్యాయి. రతిక వేసిన ప్లాన్‌కు టేస్టీ తేజ బలి పశువు కాగా..