తల్లి పాత్రకు నో చెప్పిన రష్మిక..
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది చిత్రసీమలో అగ్రస్థానంలో కొనసాగుతున్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ భామ ఇటీవలే బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. అన్ని చిత్ర సీమల్లో అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే కోలీవుడ్‌కి సైతం పరిచయమైంది. హీరో కార్తి నటించిన ‘సుల్తాన్’ చిత్రం ద్వారా పరిచయమైంది. అలాగే సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ఓ చిత్రం ద్వారా బాలీవుడ్లో రంగ ప్రవేశం చేసింది. దీంతో అమ్మడి కెరీర్ అద్భుతంగా కొనసాగుతోంది.
ఇక ఈ ముద్దగుమ్మ తాజాగా బాలీవుడ్లో రూపొందనున్న ఓ చిత్రంలో తల్లి పాత్రలో నటించాలని అడిగే నో చెప్పేసిందట. ఇంతకూ ఆ సినిమా మరేదో కాదు.. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జెర్సీ’. ఈ చిత్రం తెలుగులో ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాని హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో భార్యగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. ఈ చిత్రం తాజాగా రెండు నేషనల్ అవార్డులను గెలుచుకుంది. చిత్ర కథ మేరకు నాలుగేళ్ళ బిడ్డకు అమ్మ పాత్రలో నటించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర కోసం రష్మికను సంప్రదించగా, ఆమె నో చెప్పినట్టు సమాచారం. ఎందుకంటే శ్రద్ధా ఈ చిత్రంలో తల్లి పాత్రను పోషించింది. కాబట్టి రష్మిక సైతం తల్లి పాత్ర పోషించాల్సి ఉంటుంది. కాబట్టి నో చెప్పేసిందట. దీంతో ఈ పాత్రకు బాలీవుడ్ నటి మృణాల్ ఠాగూర్‌ను ఎంపిక చేశారు. బాలీవుడ్లో ఇప్పుడే అడుగుపెట్టిన తాను రెండో చిత్రంలోనే తల్లి పాత్రలో నటించడం వలన తన సినీ కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించే రష్మిక నో చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com