బ్రేక‌ప్‌పై ర‌ష్మిక స్పంద‌న‌..

  • IndiaGlitz, [Tuesday,September 18 2018]

న‌టుడు ర‌క్షిత్‌తో నిశ్చితార్థం జ‌రిగిన త‌ర్వాత హీరోయిన్‌గా బిజీ అయిపోవ‌డం .. ఇత‌ర కార‌ణాల‌తో ఎంగేజ్‌మెంట్ బ్రేక‌ప్ అయింది. ఈ విష‌యాన్ని ర‌ష్మిక త‌ల్లి సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించింది. దాంతో ర‌క్షిత్ అభిమానులు ర‌ష్మిక‌ను సోష‌ల్ మీడియాలో టార్గెట్ చేశారు. దీనిపై ర‌క్షిత్ స్పందిస్తూ ర‌ష్మిక గురించి నాకు తెలుసు. త‌న ప‌నిని త‌ను చేసుకోనివ్వండి అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు.

ఎట్ట‌కేల‌కు ర‌ష్మిక కూడా ఈ వ్య‌వ‌హారంపై నోరు విప్పింది. ''కాయిన్‌కు రెండు ముఖాలున్న‌ట్లు ప్ర‌తి క‌థ‌కు రెండు దారులుంటాయి. అది అంద‌రూ అర్థం చేసుకోవాలి. నేను ఇండ‌స్ట్రీలోనే ఉంటాను. తెలుగు, త‌మిళ సినిమాలు చేస్తాను. ఏ సినిమా చేసినా నా బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వ‌డానికే ప్ర‌య‌త్నిస్తాను'' అంటూ ర‌ష్మిక మెసేజ్‌ను పోస్ట్ చేసింది.