Rashmika Mandanna:శ్రీవల్లి క్యారెక్టర్‌పై ఐశ్వర్య రాజేశ్ వ్యాఖ్యలు.. మీ మాటల్లో దురుద్దేశం లేదు, వివరణ ఎందుకు : వివాదానికి చెక్ పెట్టిన రష్మిక
Send us your feedback to audioarticles@vaarta.com
అచ్చ తెలుగమ్మాయి.. ఐశ్వర్య రాజేశ్ తన మాతృభాషలో కాకుండా తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడ టాప్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. అందాల ఆరబోతకు దూరంగా కేవలం కథకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఐశ్వర్య. ఈ క్రమంలో ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘‘ఫర్హానా’’. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
శ్రీవల్లి లాంటి క్యారెక్టర్లు కావాలన్న ఐశ్వర్య :
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో రష్మిక మందన్న పోషించిన శ్రీవల్లి క్యారెక్టర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవల్లి పాత్రను తాను రష్మిక కంటే బాగా చేసేదాన్నని వ్యాఖ్యానించింది. శ్రీవల్లిగా రష్మిక బాగానే చేసిందని.. కానీ తనకు గనుక ఆ పాత్ర వచ్చుంటే ఆమె కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేసేదాన్నని ఐశ్వర్య తెలిపింది. దీంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మాటలు రష్మిక అభిమానులకు కోపం తెప్పించడంతో ఐశ్వర్యను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వివాదం పెద్దదవుతున్న నేపథ్యంలో ఐశ్వర్య రాజేశ్ స్వయంగా స్పందించారు. తన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని చెబుతూ ఓ నోట్‌ను విడుదల చేశారు. తనకు అలాంటి పాత్రలు కావాలని చెప్పానే కానీ.. రష్మిక నటనను తక్కువ చేసి మాట్లాడలేదని ఐశ్వర్య తెలిపారు. దయచేసి తాను అన్న మాటలకు విపరీత అర్ధాలు తీయొద్దని ఆమె మీడియాకు సూచించారు.
మీ మాటల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు :
తాజాగా ఈ వ్యవహారంపై రష్మిక మందన్నా స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేసిన ఆమె.. మీరు చేసిన వ్యాఖ్యల వెనుక అర్ధం తనకు బాగా తెలిసిందని, ఇందులో వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. మీ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని తాను భావిస్తున్నా. మీపై ప్రేమ, గౌరవం వున్నాయని.. మీరు నటించిన ‘‘ఫర్హానా’’ చిత్రానికి ఆల్ ది బెస్ట్ అంటూ రష్మిక రాసుకొచ్చారు. ఆమె స్వయంగా స్పందించిన నేపథ్యంలో ఇంతటితో వివాదం సద్దుమణిగినట్లేనని సినీ జనాలు భావిస్తున్నారు.
Hi love.. just came across this.. the thing is - I perfectly understood what you meant and I wish there were no reasons for us to explain ourselves and as you know I only and only have love and respect for you.. and ones again all the bestest for your film Farhana love .. 😄🤗❤️
— Rashmika Mandanna (@iamRashmika) May 18, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com