ప్రియమైన వారి నుంచి ఉంగరం అందిందంటూ రష్మిక పోస్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
నటి రష్మిక తాజాగా ఓ బహుమతి అందుకుంది. అది ఎవరి నుంచి అనేది తెలియదు కానీ ఆ గిఫ్ట్‌ని చూశాక ఆమె ఆనందానికి అవధుల్లేవని తెలుస్తోంది. అది మరేంటో కాదు.. రష్మికకు గిఫ్ట్‌గా ఓ రింగ్ వచ్చింది. వెంటనే దానిని చేతికి వేలికి తొడిగి ఆ వేలిని ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. దీనికి ఒక పోస్టును కూడా జత చేసింది. అయితే ఆ ఉంగరం తనకు అత్యంత ప్రియమైన వ్యక్తుల నుంచి అందిందని రష్మిక వెల్లడించింది. దీంతో నెటిజన్లు ఆ ఉంగరం ఎవరిచ్చారా? అని ఆరా తీయడం మొదలు పెట్టారు.
‘‘ఇది నాకు ఎవరు పంపారో తెలుసు. దీన్ని నేను అందుకున్నా. నేను మీ సీక్రెట్ మెసేజ్‌ను చదివాను. నాకిది సరిగ్గా సరిపోయింది. ఇది నాకు బాగా నచ్చింది’’ అంటూ రష్మిక ఆ ఫొటోకి ఓ వ్యాఖ్యని కూడా జత చేసింది. దీంతో ఇప్పుడీ ఉంగరం కథ కాస్తా నెట్టింట వైరల్‌గా మారిపోయింది. ప్రస్తుతం రష్మిక టాలీవుడ్‌లో చాలా బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసినప్పటి నుంచి స్టార్ హీరోలతో అవకాశాలు వస్తున్నాయి. అల్లు అర్జున్‌తో ‘పుష్ప సినిమా చేస్తున్న రష్మిక.. అటు తమిళంలోనూ ‘సుల్తాన్’ మూవీ చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com