బాలీవుడ్‌లో రష్మిక స్పీడు..!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో ఒకరైన రష్మిక మందన్న.. ఇప్పుడు తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ స్పీడు పెంచుతోంది. నిజానికి ముందు అల్లు అర్జున్‌తో సుకుమార్ చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. అయితే రీసెంట్‌గా సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. పరావాలేదే.. రష్మిక బాలీవుడ్‌లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటుందే అని అందరూ అనుకుంటున్న సమయంలో మరింత స్పీడు పెంచింది. ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాలోనూ నటించడానికి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సమాచారం మేరకు.. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో విశాల్ భట్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో రష్మిక అమితాబ్ కుమార్తె పాత్రలో కనిపించనుందని అంటున్నారు. ఈ సినిమా మార్చి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఒక సినిమా కూడా విడుదల కాకుండానే రెండు బాలీవుడ్ సినిమా, ఓ ప్యాన్ ఇండియా సినిమాతో రష్మిక మందన్న హిందీ సినీ అభిమానులను పలకరించడానికి రెడీ అయ్యింది. ఈమె స్పీడు చూస్తుంటే.. త్వరలోనే మరిన్ని బాలీవుడ్ సినిమాల్లో కనిపించి మెప్పించేలా ఉందంటున్నాయి బాలీవుడ్ సినీ వర్గాలు. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న.. పుష్ప సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments