డబ్బింగ్ చెప్పుకున్న రష్మిక
- IndiaGlitz, [Friday,January 19 2018]
నవతరం కథానాయికలు తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పుకుంటూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. నిత్యా మీనన్ లాంటి కథానాయికలు అయితే.. కేవలం తమ పాత్రలకే పరిమితం కాకుండా తమ సహనటికి కూడా డబ్బింగ్ చెప్పిన సందర్భాలున్నాయి. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో మరో హీరోయిన్గా నటించిన ఇషా తల్వార్కి నిత్యా చెప్పిన డబ్బింగ్ అప్పట్లో వార్తల్లో నిలిచింది. కాగా, తాజాగా విడుదలైన అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ డబ్బింగ్ చెప్పుకున్నారు.
జై సింహా కోసం కన్నడ భామ హరిప్రియ డబ్బింగ్ చెప్పుకుంది. ఇప్పుడు ఇదే బాటలో మరో కన్నడ ముద్దుగుమ్మ కూడా చేరింది. ఆమే.. రష్మిక మండన్నా. కన్నడ బ్లాక్బస్టర్ మూవీ కిరిక్ పార్టీలో ఓ హీరోయిన్గా నటించిన రష్మిక.. ఛలో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం రష్మిక తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి.. డబ్బింగ్ విషయంలో టాలీవుడ్లో మంచి ట్రెండ్ కొనసాగుతోందనే చెప్పాలి.