ముంబైలో ఫ్లాట్ కొన్న రష్మిక.. అక్కడే సెటిల్ అవుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న కన్నడ భామ రష్మికా మందన్న.. అక్కడ కంటే టాలీవుడ్లో బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ భామ అటు తమిళ్లోనూ.. ఇటు బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ముఖ్యంగా బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేయడం విశేషం. స్టార్ హీరో కార్తి సరసన నటించిన `సుల్తాన్`తో ఈ ఏడాది తమిళ తెరంగేట్రం చేయబోతోంది.
ఇక, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న `మిషన్ మజ్ను`తో బాలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది. ఈ సినిమా కోసం రష్మిక ప్రత్యేకంగా యాక్టింగ్ క్లాసులకు కూడా వెళ్లిందట. ఒక ట్యూటర్‌ను పెట్టుకుని ప్రత్యేకంగా హిందీ కూడా నేర్చుకుంటోందట. దీన్ని బట్టి సినిమాలపై ఆమెకున్న ప్యాషన్ అర్థమవుతోంది. పలు భాషా చిత్రాల్లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ తాజాగా ముంబైలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందని సమాచారం. ‘మిషన్ మజ్ను’ తర్వాత బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి `డెడ్లీ` సినిమాలో రష్మిక నటించబోతోంది.
బాలీవుడ్ నుంచి రష్మికకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. బిగ్‌బీ సినిమా తర్వాత అమ్మడికి బాలీవుడ్లో అమ్మడి స్టార్ మారిపోయే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. అయితే బాలీవుడ్ అవకాశాల నేపథ్యంలో ముంబై వెళ్లినప్పుడల్లా ఉండడానికి రష్మిక అక్కడ ఓ విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసిందట. బాలీవుడ్లో అవకాశాలు కలిసి వస్తే మాత్రం రష్మిక ముంబైలోనే సెటిల్ అవుతుందని ఇప్పటికే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సైతం ముంబైలో ఫ్లాట్ కొనేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రష్మిక కూడా అదే బాటలో నడవబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments