స్పోర్ట్ ఉమెన్‌గా రష్మిక?
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్ స్టార్ విజయ్ దేవరకొండ.. నూతన దర్శకుడు భరత్ కమ్మ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘పెళ్లి చూపులు’ నిర్మాత యష్ రంగినేనితో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించనుందని సమాచారం. లవ్ స్టోరీగా తెరకెక్కబోయే ఈ సినిమాలో విజయ్ సరసన ‘ఛలో’ ఫేమ్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.
మళ్ళీ రెండోసారి ఈ సినిమా కోసం జంట కట్టారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రష్మిక స్పోర్ట్స్ ఉమెన్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం విజయ్ నటించిన ‘మహానటి’, ‘టాక్సీవాలా’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న బైలింగ్వల్ (తెలుగు, తమిళం) ఫిలిమ్ ‘నోటా’ చిత్రీకరణ జరుపుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com