మానవత్వం ఎక్కడుంది..? రష్మిక హార్ట్ టచింగ్ ట్వీట్

  • IndiaGlitz, [Saturday,April 20 2019]

'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా అతి తక్కువ సమయంలోనే తానేంటో నిరూపించుకుంది. స్టార్ హీరోల సరసన నటించాలంటూ ఈమెకోసం దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారంటే రష్మిక రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.! ముఖ్యంగా విజయ్ దేవరకొండ సరసన నటించిన 'గీత గోవిందం'తో టాలీవుడ్‌లో బాగా హైలైట్ అయ్యింది.

అలా తెలుగు సినీ ఇండస్ట్రీలో అనతికాలంలోనే రష్మిక టాప్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. రష్మిక నటనకు ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఫిదా అయిపోయి అభిమానులుగా మారిపోయారు. అటు సినిమాలతో బిజీబిజీగా ఉన్నప్పటికీ అభిమానులు, సినీ ప్రియులతో రష్మిక నిత్యం సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటూ వస్తోంది.

తాజాగా.. ట్విట్టర్ వేదికగా రష్మిక హార్ట్ టచింగ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌‌ చూసిన నెటిజన్లు ఒకింత తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఇటీవల రాయచూర్ అడవుల్లో ఇంజనీర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నెట్టింట్ట పెద్ద ఎత్తున రగడ జరుగుతోంది. ఈ అమానుష ఘటనపై సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకూ అందరూ స్పందిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా రష్మిక కూడా రియాక్ట్ అయ్యింది.

రష్మిక ట్వీట్ సారాంశం...

అసలు మనుషుల్లో మానవత్వం ఎక్కడుంది..? రాయచూర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని మధుపై పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నా హృదయాన్ని కలచివేసింది (గుండెను బద్దలు చేసింది). ఇలాంటి ఘటనలు ఇంకా ఎంత మంది ఎదుర్కోవాలి?. మధుకు న్యాయం జరగాలి.. అంతేకాదు ఇదే చివరి సంఘటన కావాలని ఆశిస్తున్నాను అని రష్మిక తీవ్ర ఆవేదనతో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఇది చాలా బాధాకారమైన ఘటన మేడమ్.. సారీ నేను హెల్ప్‌లెస్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.