మాజీ లవర్‌తో సినిమా చేస్తానంటున్నర‌ష్మిక‌

  • IndiaGlitz, [Saturday,June 13 2020]

న‌య‌న‌తార‌, హ‌న్సిక బాట‌లోనే తాను పయనిస్తాన‌ని అంటోంది క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌. ఈ సొగ‌స‌రి క‌న్న‌డంలో రూపొందిన కిరిక్ పార్టీతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఆ సినిమా క‌న్న‌డ‌లో పెద్ద హిట్. ఆ త‌ర్వాత తెలుగులోకి ఛ‌లోతో ఎంట్రీ ఇచ్చి ఇక్క‌డ స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. మ‌హేశ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి వారితో సినిమాలు చేస్తుంది. మ‌రో ప‌క్క క‌న్న‌డంలోనూ సినిమాలు చేస్తుంది. అయితే తొలి సినిమా హీరో ర‌క్షిత్ శెట్టితో కిరిక్ పార్టీ స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డింది. ఇరు కుటుంబాల వాళ్లు మాట్లాడుకుని పెళ్లి చేయాల‌నుకున్నారు. నిశ్చితార్థం కూడా చేశారు. ఆ త‌ర్వాతే ట్విస్ట్ త‌ర్వాత ర‌ష్మిక బిజీ స్టార్ అయ్యింది. త‌ర్వాత ఏమైందో ఏమో కానీ వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.

ర‌క్షిత్ అభిమానులు సోష‌ల్ మీడియాలో ర‌ష్మిక‌ను టార్గెట్ కూడా చేశారు. వారికి జ‌డిసి కొన్నాళ్ల‌పాటు ర‌ష్మిక సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండింది కూడా. ఎవ‌రు దారుల్లో వాళ్లు సినిమాలు చేసుకుంటూ పోతున్న స‌మ‌యంలో ర‌క్షిత్ శెట్టి కిరిక్ పార్టీ సీక్వెల్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. తొలి భాగంలో న‌టించిన వారంద‌రూ సీక్వెల్‌లో చేస్తున్నారు. ఒక హీరోయిన్ త‌ప్ప‌. అయితే నిర్మాత‌లు మాత్రం ర‌ష్మిక అయితే బావుంటుంద‌ని అనుకున్నార‌ట‌. ర‌ష్మిక కూడా ప్రొఫెష‌న‌ల్‌గా తాను ర‌క్షిత్‌తో ప‌నిచేయ‌డానికి సిద్ధ‌మేన‌ని చెప్పింద‌ట‌. దీంతో మేక‌ర్స్ ఇప్పుడు ర‌క్షిత్ శెట్టిని ఒప్పించే ప‌నుల్లో ఉన్నార‌ట‌.మరి రక్షిత్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.