ఒత్తిడిలో రష్మిక ఏం చేస్తుందో తెలుసా?
- IndiaGlitz, [Sunday,December 30 2018]
పనిలో ఎక్కువగా మునిగి తేలే వారు ఒత్తిడికి గురవుతుంటారు. ఆ ఒత్తిడిని దూరం చేసుకోడానికి ఒక్కొక్కరు ఒక్కో రీతిన ప్రవర్తిస్తుంటారు. హీరోయిన్ రష్మిక విషయానికి వస్తే.. ఒత్తిడి సమయంలో తను ఎక్కువగా స్నేహితులతో మాట్లాడుతుంది. అంతే కాకుండా, పెట్స్ ఆడుకుంటుంది. ఎక్కువ సేపు నిద్రపోతుంది, బొమ్మలు గీస్తుంది.
షూటింగ్స్ లేకపోతే జపనీస్ సినిమాలు, టీవీ సీరియల్స్ చూస్తుంటాను. కొన్నిసార్లు పుసక్తాలు చదువుతుంటానని రష్మిక తెలియజేసింది. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన రష్మిక ఇప్పుడు విజయ్ దేవరకొండతో 'డియర్ కామ్రేడ్'లో నటిస్తుంది. ఇది కాకుండా నితిన్‌తో 'భీష్మ'లో నటించనుంది.