లుక్ కోసం హెయిర్ క‌ట్ చేసుకుంటున్న ర‌ష్మిక‌

  • IndiaGlitz, [Sunday,January 06 2019]

ఛ‌లోతో తెలుగులో స‌క్సెస్ అందుకుని గీత గోవిందం బ్లాక్ బ‌స్ట‌ర్‌తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది ర‌ష్మిక మంద‌న్నా. ఈ క‌న్న‌డ భామ ఇప్పుడు మ‌రోసారి విజ‌య‌దేవ‌ర‌కొండ‌తో 'డియ‌ర్ కామ్రేడ్‌' సినిమాలో న‌టిస్తుంది.

భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా రూపొందుతోంది. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా క్రికెట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ పాత్ర లుక్ కోసం ర‌ష్మిక హెయిర్‌ను క‌త్తిరించుకోనుంది. ఎక్కువ పొడ‌వు లేకుండా ఉండేందుకు.. పాత్ర లుక్ కోసం ర‌ష్మిక ఆ ప‌ని చేయ‌నుంద‌ట‌.

పాత్ర కోసం ర‌ష్మిక క‌మిట్‌మెంట్‌కు యూనిట్ ఆమెను అభినందిస్తున్నారు. రీసెంట్‌గా సినిమా కాకినాడ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. స‌మ్మ‌ర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.