అయోధ్యపై తీర్పు: ‘జై శ్రీరామ్’.. మీ కొచ్చిన సమస్య ఏంటి?: రష్మి
Send us your feedback to audioarticles@vaarta.com
దశాబ్దాలుగా నెలకొన్న అయోధ్య భూ వివాదంపై నేడు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్థలం హిందువులకు.. ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం అంటూ సింగిల్ మాటతో సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఈ చరిత్రాత్మక తీర్పు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ట్విట్టర్, మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ తీర్పుపై టాలీవుడ్ యాంకర్, జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ రియాక్ట్ అయ్యింది. ట్విట్టర్ వేదికగా తీర్పు అనంతరం ‘జై శ్రీరామ్’ అని రాసుకొచ్చిన ఈ బ్యూటీ అయోధ్య వర్డిక్ట్ అని హ్యాష్ ట్యాగ్‌ను తగిలించింది. అయితే ఈమె ట్వీట్‌పై పలువురు నెటిజన్లు, వీరాభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ వచ్చింది.
అయితే ఒక నెటిజన్ మాత్రం రష్మిని తికమక పెట్టే ప్రశ్న వేశాడు. సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సమర్థించడం ద్వారా ముస్లింలదే తప్పని మీరు భావిస్తున్నారా..!? అని రష్మిని ప్రశ్నించాడు. ఇందుకు యాంకర్ స్పందిస్తూ.. ‘వివాదస్పద స్థలం హిందువులకు ఇచ్చి.. అదే అయోధ్యలోనే మరో చోట భూమి ఇస్తున్నారు కదా.. ఇక్కడ మీ కొచ్చిన సమస్య ఏంటి?..’ తనతో మరోసారి ట్వీట్ చేయించాలనే ఇలా చేస్తున్నారా..? లేకుంటే ఏంటి..? అని ఒకింత ఘాటుగానే రిప్లై ఇచ్చింది. కాగా ఇలా తనను విమర్శిస్తూ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికీ రష్మి ఓ రేంజ్‌లో రిప్లై, పంచ్‌ల వర్షం కురిపించింది. అంతేకాదు.. తాను ఇదివరకు దీపావళి సందర్భంగా చేసిన ట్వీట్స్‌ను సైతం రష్మి ఈ సందర్భంగా గుర్తు చేసుకుకుంది.
They are being allocated another land in #ayodhya itself
— rashmi gautam (@rashmigautam27) November 9, 2019
So what’s ur issue here
Or just another attempt to get a reply from me https://t.co/VoybGDJ9KY
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments