అయోధ్యపై తీర్పు:  ‘జై శ్రీరామ్’.. మీ కొచ్చిన సమస్య ఏంటి?: రష్మి

  • IndiaGlitz, [Saturday,November 09 2019]

దశాబ్దాలుగా నెలకొన్న అయోధ్య భూ వివాదంపై నేడు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్థలం హిందువులకు.. ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం అంటూ సింగిల్ మాటతో సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఈ చరిత్రాత్మక తీర్పు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ట్విట్టర్, మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ తీర్పుపై టాలీవుడ్ యాంకర్, జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ రియాక్ట్ అయ్యింది. ట్విట్టర్ వేదికగా తీర్పు అనంతరం ‘జై శ్రీరామ్’ అని రాసుకొచ్చిన ఈ బ్యూటీ అయోధ్య వర్డిక్ట్ అని హ్యాష్‌ ట్యాగ్‌ను తగిలించింది. అయితే ఈమె ట్వీట్‌పై పలువురు నెటిజన్లు, వీరాభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ వచ్చింది.

అయితే ఒక నెటిజన్ మాత్రం రష్మిని తికమక పెట్టే ప్రశ్న వేశాడు. సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సమర్థించడం ద్వారా ముస్లింలదే తప్పని మీరు భావిస్తున్నారా..!? అని రష్మిని ప్రశ్నించాడు. ఇందుకు యాంకర్ స్పందిస్తూ.. ‘వివాదస్పద స్థలం హిందువులకు ఇచ్చి.. అదే అయోధ్యలోనే మరో చోట భూమి ఇస్తున్నారు కదా.. ఇక్కడ మీ కొచ్చిన సమస్య ఏంటి?..’ తనతో మరోసారి ట్వీట్ చేయించాలనే ఇలా చేస్తున్నారా..? లేకుంటే ఏంటి..? అని ఒకింత ఘాటుగానే రిప్లై ఇచ్చింది. కాగా ఇలా తనను విమర్శిస్తూ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికీ రష్మి ఓ రేంజ్‌లో రిప్లై, పంచ్‌ల వర్షం కురిపించింది. అంతేకాదు.. తాను ఇదివరకు దీపావళి సందర్భంగా చేసిన ట్వీట్స్‌ను సైతం రష్మి ఈ సందర్భంగా గుర్తు చేసుకుకుంది.

More News

టీచర్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి

సినిమా రంగంలో సెంటిమెంట్‌ను ఫాలో కానీ వారుండ‌రు. టాప్ స్టార్స్ నుండి చిన్న‌వారు వ‌ర‌కు అంద‌రికీ ఏదో ఓక సెంటిమెంట్ ఉంటుంది.

ప్ర‌భాస్ 'జాన్' లో బాహుబలి సెంటిమెంట్

బాహుబ‌లితో నేష‌న‌ల్ రేంజ్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. త‌ర్వాత విడుద‌లైన సాహోతో ఓకే అనిపించుకున్నాడు.

కొత్త రంగంలోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్ ?

హీరోగా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ స్టార్ హీరోగా కొన‌సాగుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొత్త ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

‘చలో ట్యాంక్‌బండ్’లో కలకలం..  మావోలు రంగంలోకి దిగారా!?

గత కొన్ని రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్స్‌ను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.

అయోధ్య నేపథ్యంలో మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు

భారతదేశంలో అతిపెద్ద, దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే.