రాంగ్ రూటులో రేష్మి..!
Monday, December 19, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
జబర్ధస్ట్ కార్యక్రమంతో బాగా పాపులర్ అయిన హాట్ యాంకర్ రేష్మి. ఆతర్వాత గుంటూరు టాకీస్ చిత్రంలో నటించి యూత్ ను బాగా ఆకట్టుకుంది.ఇంతకీ... రాంగ్ రూటులో రేష్మి ఏమిటి అనుకుంటున్నారా...? రేష్మి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నంధ్యాల వెళ్లాల్సింది కరీంనగర్ వెళ్లిందట. ఎందుకిలా జరిగిందంటే..తన కారు డ్రైవర్ ను కర్నూలు తీసుకువెళ్లమంటే...కరీంనగర్ తీసుకెళ్లాడట ఈ విషయాన్ని రేష్మి చెప్పింది.
దీంతో రేష్మి తను హాజరు కావాల్సిన ప్రైవేట్ కార్యక్రమానికి ఆలస్యంగా వెళ్లింది. అనంతరం ఈ కార్యక్రమంలో రేష్మి మాట్లాడుతూ...తను ఎందుకు ఆలస్యంగా వచ్చిందో జరిగిన విషయం చెప్పి సారీ చెప్పందట. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని పలు పాటలకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. రేష్మిని చూడడానికి వచ్చిన జనాన్ని అదుపుచేయడం పోలీసులకు కష్టమైందట. అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments