నెల్లూరు ఘటనపై అందరూ గళం విప్పాలి : రష్మి
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో పోలీసుల తీరు వివాదాస్పదమైన విషయం విదితమే. జిల్లాలోని ఆత్మకూరు ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ చేస్తున్న గదిలో చిన్నారి (06)తో గదిని తుడిపించారని ఆరోపణలు వచ్చాయి. స్కూల్ వాచ్మెన్ కుమార్తెతో గదిని తుడిపించారు.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారం అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మరోవైపు.. పోలీస్ కానిస్టేబుల్ దగ్గరుండి గదిని శుభ్రం చేయించారని.. పిల్లలతో పనులు చేయించకూడదని తెలిసీ దారుణంగా ప్రవర్తించారని బాలల హక్కుల సంఘం మండిపడింది..
అందరూ గళం విప్పాలి..
ఈ ఘటనపై యాంకర్ రష్మి ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ ఘటనను ఒక సాధారణ అంశంగా చూడకూడదని రష్మి చెప్పింది. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళాన్ని వినిపించాలని కోరింది. రష్మి ట్వీట్‌కు పలువురు నెటిజన్లు స్పందించి మద్దతిచ్చారు. కాగా సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే రష్మి సమాజంలో జరిగే విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.
డీజీపీ రియాక్షన్..
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఏపీ డీజీపీ దృష్టికి తెచ్చి చర్యలు చేపట్టాలని కోరింది. దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో గది శుభ్రం చేసే సమయంలో పోలీసు హెడ్ కానిస్టేబుళ్లు ప్రేక్షక పాత్ర పోషించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారాయన. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని.. అదే విధంగా ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నెల్లూరు జిల్లా ఎస్పీని సవాంగ్ ఆదేశించారు. ఇప్పటికే పలువురు ఈ ఘటనపై స్పందించి తీవ్రంగా తప్పుబట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout