అల్లు అర్జున్ రేర్ రికార్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవడు, రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి.. ఇలా వరుసగా పాజిటివ్ రిజల్ట్స్‌తో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ స్టైలీష్ స్టార్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు'గా ముస్తాబవుతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. నైజాం కలెక్షన్లకి సంబంధించి బన్ని ఓ రేర్ రికార్డ్‌ని సొంతం చేసుకున్నాడని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అదేమిటంటే.. బన్ని నటించిన ఐదు వరుస చిత్రాలు నైజాంలో రూ.10 కోట్లకి పైగా షేర్ ని సొంతం చేసుకున్నాయి. దీంతో మరే తెలుగు హీరో సాధించని ఫీట్‌ని బన్ని సాధించినట్లయ్యిందని ట్రేడ్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. బన్ని ఈ పరంపరని కొనసాగించాలని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com