శ్రీవిష్ణు సినిమాకు అరుదైన గుర్తింపు...
Send us your feedback to audioarticles@vaarta.com
వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపే కొద్ది మంది యువ కథానాయకుల్లో శ్రీవిష్ణు ఒకరు. ఆయన నటించిన గత చిత్రం 'నీది నాది ఒకే కథ' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ద్వారా వేణు ఊడుగుల దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఇప్పుడు ఈ సినిమాకు అరుదైన గుర్తింపు దక్కింది. వచ్చే సెప్టెంబర్ నెల 7న డి.సి సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ఈ వేడుకకి దర్శకుడు ప్రత్యేకంగా హాజరవుతారని సమాచారం. ప్రస్తుతం శ్రీవిష్ణు 'తిప్పరా మీసం' సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. అలాగే శ్రీవిష్ణు నటించిన 'వీరభోగ వసంత రాయలు' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments