బన్నీ అరుదైన గుర్తింపు

  • IndiaGlitz, [Friday,August 23 2019]

ఉత్త‌రాది, ద‌క్షిణాది సినిమాలు, స్టార్‌హీరోల మ‌ధ్యనున్న అంత‌రాలు త‌గ్గుతున్నాయి. 'బాహుబ‌లి', 'సాహో' వంటి మ‌న తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతున్నాయి. త్వ‌ర‌లోనే 'సైరా న‌ర‌సింహారెడ్డి' చిత్రం కూడా బాలీవుడ్‌లో భారీ రేంజ్‌లో విడుద‌ల కానుంది. క్ర‌మంగా మ‌న స్టార్స్‌కు బాలీవుడ్‌లో ప్రాధాన్య‌త పెరుగుతుంది. ఇప్పుడు దానికి మ‌రో ఎగ్జాంపుల్ దొరికింది. అదేంటంటే.. ఆగ‌స్ట్ 15న విడుద‌లైన బాలీవుడ్ చిత్రం 'బాట్లా హౌస్‌' స‌క్సెస్ మీట్ రీసెంట్‌గా ముంబైలో జ‌రిగింది. ఈ వేడుక‌ల‌కు చిత్ర యూనిట్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని ప్ర‌త్యేకంగా ఆహ్వానించింది. డైరెక్ట‌ర్ నిఖిల్ అద్వానీ, ఇత‌ర స‌భ్యులు బ‌న్నీని చ‌క్క‌గా రిసీవ్ చేసుకున్నారు. ఈ సంద‌ర్భంలో డైరెక్ట‌ర్ నిఖిల్ అద్వానీతో బ‌న్నీ క్రియేటివ్ వ‌ర్క్స్‌కు సంబంధించిన డిస్క‌ష‌న్ చేశాడ‌ట‌. మ‌రి భ‌విష్య‌త్‌లో బ‌న్నీ ఏదైనా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో న‌టిస్తాడేమో చూడాలి.

ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న 19వ చిత్రం 'అల వైకుంఠ‌పురంలో..' న‌టిస్తున్నాడు. స్టార్ రైట‌ర్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ట‌బు కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రాం బ‌న్నీ తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్నారు. 'జులాయి', 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి' చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.