బన్నీ అరుదైన గుర్తింపు
Send us your feedback to audioarticles@vaarta.com
ఉత్తరాది, దక్షిణాది సినిమాలు, స్టార్‌హీరోల మధ్యనున్న అంతరాలు తగ్గుతున్నాయి. `బాహుబలి`, `సాహో` వంటి మన తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ భారీ రేంజ్లో విడుదలవుతున్నాయి. త్వరలోనే `సైరా నరసింహారెడ్డి` చిత్రం కూడా బాలీవుడ్లో భారీ రేంజ్లో విడుదల కానుంది. క్రమంగా మన స్టార్స్‌కు బాలీవుడ్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఇప్పుడు దానికి మరో ఎగ్జాంపుల్ దొరికింది. అదేంటంటే.. ఆగస్ట్ 15న విడుదలైన బాలీవుడ్ చిత్రం `బాట్లా హౌస్` సక్సెస్ మీట్ రీసెంట్గా ముంబైలో జరిగింది. ఈ వేడుకలకు చిత్ర యూనిట్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. డైరెక్టర్ నిఖిల్ అద్వానీ, ఇతర సభ్యులు బన్నీని చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంలో డైరెక్టర్ నిఖిల్ అద్వానీతో బన్నీ క్రియేటివ్ వర్క్స్‌కు సంబంధించిన డిస్కషన్ చేశాడట. మరి భవిష్యత్‌లో బన్నీ ఏదైనా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటిస్తాడేమో చూడాలి.
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 19వ చిత్రం `అల వైకుంఠపురంలో..` నటిస్తున్నాడు. స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తుంది. మలయాళ నటుడు జయరాం బన్నీ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com