బాలయ్య హీరోయిన్‌కి అరుదైన అవార్డు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్‌లో నటించిన నటి రాధికా ఆప్టే. ఆమెకు ఇంటర్నేషనల్ స్థాయిలో అరుదైన అవార్డు లభించింది. ఆ అవార్డు ఆమె నటించిన చిత్రానికి రాలేదు. ఆమె తొలిసారి చేసిన ఓ ప్రయత్నానికి లభించింది. ఇంతకీ ఏంటని రాధికను అడిగితే ``నేను చాలా ఆనందంగా ఉన్నాను. థాంక్యూ సో మచ్ పామ్స్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫెస్ట్ `` అని అన్నారు. విషయం ఏంటంటే రాధికా ఆప్టే దర్శకత్వం వహించిన ది స్లీప్ వాకర్స్ అనే లఘు చిత్రానికి అంతర్జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో నిర్వహించిన పామ్స్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫెస్ట్ లో ఈ అవార్డును ప్రకటించారు.
రాధికా ఆప్టే మాట్లాడుతూ ``నేను దర్శకత్వం ప్రాసెస్‌ని చాలా చాలా ఎంజాయ్ చేశారు. చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. త్వరలోనే ప్రజలు నా షార్ట్ ఫిల్మ్ ని చ ఊస్తారు. నేను దర్శకత్వంలో చాలా దూరం ప్రయాణించాలనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూడాలి. గత ఏడాది నేను డైవింగ్ మొదలుపెట్టినప్పుడు నాకు ఈ కథ ఐడియా వచ్చింది. స్లీప్ వాకర్స్ కి కథ కూడా నేనే రాసుకున్నాను`` అని అన్నారు. ఈ లఘు చిత్రంలో షహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. నిద్రలో నడవడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ చిత్రం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com