ఆదిత్య చిత్రానికి అరుదైన అవార్డ్..
Send us your feedback to audioarticles@vaarta.com
భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిల్మ్స్ నిర్మించిన బాలల చిత్రం ఆదిత్య క్రియేటివ్ జీనియస్. అమెరికా లాస్ ఏంజిల్స్ లో నిర్వహించిన జెన్రీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆదిత్య బాలల చిత్రం ప్రదర్శనను ఎంపికై ఉత్తమ చిత్రం అవార్డ్ ను కైవసం చేసుకుంది. అదే విధంగా న్యూయార్క్ సన్ ఫెస్ట్ 2016 గాను ఎంపికై అవార్డ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని చిల్ర్డన్ ఫిల్మ్ సోసైటీ ఆఫ్ ఇండియా 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ప్రదర్శించడంతో హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల ప్రశంసలు పొందింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల వంద శాతం వినోదపన్ను రాయితీ పొందింది. అలాగే ఉత్తమ చిత్రం మరియు తెలంగాణ ప్రభుత్వం హోమ్ డిపార్టెమెంట్ నుంచి ప్రత్యేకమైన నూన్ షోకి అనుమతి లభించింది.
ఈ చిత్రాన్ని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విద్యార్ధుల కోసం ప్రత్యేక నూన్ షోస్ ప్రదర్శనకు దర్శకనిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర కథ ప్రధాన అంశం భారతరత్న డా.ఎ.పి.జె అబ్దుల్ కలామ్ ఆశయంతో విద్యార్ధులు శాస్త్రజ్ఞులుగా ఎదగాలని సందేశం ఉంటుంది. అబ్దుల్ కలాం స్పూర్తితో బాలలు శాస్త్రజ్ఞులుగా ఎదగాలని దేశ అభివృద్దికి వివిధ రంగాల పరిశోధనలలో రాణించాలనే సదుద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమారు రెండు వేల మంది బాలబాలికలు ఈ చిత్రంలో నటించారు. ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదు అనే నినాదంతో ఒక ప్రభుత్వ పాఠశాల అనాధ బాలుడు డా.ఎ.పి జె అబ్దుల్ కలాం జూనియర్ సైంటిస్ట్ అవార్డు లీడ్ ఇండియా మూమెంట్ వారు ఇచ్చే అవార్డును ఎలా కైవసం చేసుకుంటాడు అనేది ఈ చిత్రంలో చూపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com