మే13న 'రారండోయ్.. వేడుక చూద్దాం' థియేట్రికల్ ట్రైలర్
Friday, May 12, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే. శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మే 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు శ్రోతల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. మే 13 శనివారం ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 26న సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
యువసామ్రాట్ నాగచైతన్య, రకుల్‌ప్రీత్ సింగ్, జగపతిబాబు, సంపత్, కౌసల్య, ఇర్షాద్(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, ప థ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్, పోసాని క ష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్, ఇష్క్ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: సత్యానంద్, సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశ్వేశ్వర్, ఎడిటింగ్: గౌతంరాజు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్: రాజుసుందరం, ఆర్ట్: సాహి సురేష్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments