సీఎం నిర్ణయం చారిత్రాత్మకం.. జగన్‌కు జై..: రాపాక
- IndiaGlitz, [Monday,December 16 2019]
జనసేన వన్ అండ్ ఓన్లీ రాపాక వరప్రసాద్ మరోసారి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అసెంబ్లీ వేదికగా జై కొట్టారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు.
ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను స్వాగతిస్తున్నామని మద్దతిచ్చారు. ‘సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం. జగన్ నిర్ణయంతో దళితులు అభివృద్ధి చెందుతారు. సీఎం జగన్ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను. బడుగు, బలహీన వర్గాలకు సమాజంలో సమాన స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంది’ అని వైఎస్ జగన్ గురించి రాపాక కొనియాడారు.
ఇప్పటికే రాపాక పలుమార్లు వైసీపీని.. ఆ పార్టీ అధినేత కమ్ సీఎం జగన్‌ను ఆకాశానికెత్తిన సంగతి తెలిసిందే. అంటే రాపాక మనసులో పార్టీ మారాలని ఉందా..? లేదా..? లేకుంటే పరోక్షంగా పార్టీ మారుతున్నానని.. ఇలా చెబుతున్నారా..? అనేది మాత్రం రాపాకకే తెలియాల్సి ఉంది.
కాగా వన్ అండ్ ఓన్లీ వ్యాఖ్యలపై పవన్, నాదెండ్ల, సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే మరి.