కె.వి.పి పాత్ర‌లో రావు ర‌మేశ్‌

  • IndiaGlitz, [Sunday,May 13 2018]

యాత్ర పేరుతో మ‌హి .వి.రాఘ‌వ్ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ బ‌యోపిక్‌లో వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి న‌టిస్తున్నారు.

రాజ‌కీయాల్లో తెలుగు ప్ర‌జ‌ల‌కు గుర్తుండిపోయిన నాయ‌కుల్లో వై.ఎస్‌.ఆర్ ఒక‌రు. ఆయ‌న‌కు కె.వి.పి.రామ‌చంద్ర రావుతో మంచి అనుబంధం ఉండేది. ఇప్పుడు సినిమా విష‌యంలో కూడా కె.వి.పి పాత్ర కీల‌కంగా మారింది. ఈ పాత్ర‌లో ఇప్పుడు రావు ర‌మేశ్ న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం.