పవన్ కి అత్త మామలు..మరి చరణ్ కి...

  • IndiaGlitz, [Wednesday,August 05 2015]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ కళ్యాణ్ అత్తగా నదియా, మావయ్యగా రావు రమేష్ లు నటించిన సంగతి విదితమే. అయితే ఇదే కాంబినేషన్ మళ్లీ రిపీటవుతుంది. ఇంతకు ముందు బాబాయ్ కి అత్త మామలుగా నటించిన వీరు అబ్బాయ్ రామ్ చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రంలో చరణ్ తండ్రిగా రావు రమేష్, తల్లిగా నదియా కనిపించనున్నారట.

ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. అక్టోబర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి యూనిట్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి.