దీపికను ఏడిపించిన రణవీర్‌సింగ్...
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్న లేదు మొన్ననే పెళ్లైంది అప్పుడే దీపికను రణవీర్ సింగ్ ఎందుకు ఏడిపించాడా? అనే సందేహం రాకమానదు. వివరాల్లోకెళ్తే.. ఆదివారం స్టార్ స్క్రీన్ అవార్డ్స్ కార్యక్రమం ముంబైలో ఘనంగా జరిగాయి. బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఇందులో రణవీర్ సింగ్, దీపికా పదుకొనెలు కూడా ఉన్నారు. ఈ అవార్డ్స్ కార్యక్రమంలో పద్మావత్‌లో అల్లావుద్ధీన్ ఖిల్జీ పాత్రలో నటించిన రణవీర్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. దీనిపై రణవీర్ సింగ్ స్పందిస్తూ.. పద్మావత్‌లో రాణి నాకు దక్కలేదు. కానీ..నిజ జీవితంలో రాణి దక్కింది.
బేబి ఐ లవ్ యూ. ఈ ఆరు సంవత్సరాల్లో నేను సాధించిన దానికి కారణం నువ్వే దీనికి ధన్యవాదాలు" అంటూ క్రెడిట్ అంతా దీపికకే ఇచ్చాడు. దీంతో భావోద్వేగానికి గురైన దీపికా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout