క‌పిల్‌లా మారిన ర‌ణ‌వీర్ సింగ్.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Saturday,July 06 2019]

ప్ర‌స్తుతం బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తుంది. ఈ త‌రుణంలో 1983 ప్ర‌పంచ క‌ప్ జ‌ర్నీని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కుతున్న చిత్రం '83'. విష్ణుఇందూరి నిర్మాణంలో క‌బీర్ సింగ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. క‌పిల్ డెవిల్స్ విన్నింగ్ జ‌ర్నీ కోసం ఇప్పుడు యూనిట్ అంతా ఇంగ్లాండ్ చేరుకుంది. అక్క‌డ సీనియ‌ర్ క్రికెట‌ర్ బల్వింద‌ర్ సింగ్ నేతృత్వంలో శిక్ష‌ణ‌ను తీసుకుంటున్నారు యూనిట్ స‌భ్యులు. లార్డ్స్‌లో ఫైన‌ల్ చిత్రీక‌రించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈరోజు ర‌ణ‌వీర్ సింగ్ పుట్టిన‌రోజు కాబ‌ట్టి ఆ సంద‌ర్భంగా చిత్రీ యూనిట్ క‌పిల్‌ను పోలిన ర‌ణ‌వీర్ సింగ్ ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. లుక్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుద‌ల చేస్తున్నారు.