ర‌ణ‌వీర్, దీపికా పెళ్లి డేట్ ఫిక్స్‌

  • IndiaGlitz, [Sunday,October 21 2018]

బాలీవుడ్ తార‌ల ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనేలు వివాహం చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. అయితే వీరి పెళ్లి తేదీపై ఇద్ద‌రూ త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్స్ ద్వారా పెళ్లి వేడుక‌ను నిర్వ‌హించే తేదీపై క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వీరి పెళ్లి డేట్‌పై వ‌స్తున్న వార్త‌ల‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. న‌వంబ‌ర్ 14..15 తేదీల్లో పెళ్లి చేసుకోతున్న‌ట్లు వీరు ప్ర‌క‌టించారు.

ఈలోపు ర‌ణ‌వీర్‌, దీపికా ప‌దుకొనే వారి క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ర‌ణ‌వీర్ కూడా టెంప‌ర్ రీమేక్ సింబాను ఈనెల‌లోనే పూర్తి చేసుకుని.. న‌వంబ‌ర్‌లో పెళ్లి ప‌నుల‌తో బిజీ కాబోతున్నారు. అయితే న‌వంబ‌ర్‌లోనే ప్రియాంక‌, జోనస్‌ల పెళ్లి అని వార్త‌లు వ‌చ్చినా.. మ‌రో వైపు వ‌చ్చే జ‌న‌వ‌రికి వాయిదా ప‌డింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ప్రియాంక‌, జోన‌స్‌లు వారి పెళ్లి తేదీపై ఎలాంటి ప్ర‌క‌టన చేస్తారో చూడాలి.