'స్టార్‌ మా' లో రాణి రుద్రమ!!

  • IndiaGlitz, [Monday,January 18 2021]

పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ పౌరుషాన్ని, వీరవిక్రమాల్ని ఓరుగల్లు కోట బురుజులపై కాకతీయ పతాకంలా ఎగరేసిన సాహస నారి, సంచలనాల విజయభేరి రుద్రమదేవి కథను ఇప్పుడు ప్రేక్షకులకు ఒక విశిష్టమైన ధారావాహికగా అందిస్తోంది తెలుగువారి అభిమాన ఛానల్‌ స్టార్‌ మా.

అచ్చమైన ఈ తెలుగు కథను కేవలం తెలుగువారి కోసం మాత్రమే ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దింది. భారీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్‌ మా అందించబోతున్న ఈ సీరియల్‌ తెలుగు టెలివిజన్‌ వ్యూయింగ్‌ పరంగా కొత్త అధ్యాయం సృష్టించబోతోంది. సరికొత్త అనుభూతిని పంచబోతోంది.

వీరోచితమైన కథల్ని, స్పూర్తి నిచ్చే గాధల్ని వినూత్నరీతిలో అందించి ఎన్నో విజయాల్ని అందుకున్న స్టార్‌ మా ఛానెల్‌ ఇప్పుడు భారీ ప్రయత్నంగా రుద్రమదేవి” కథని మరపురాని స్పాయిలో అందిస్తోంది. ఈ మెగా ప్రాజెక్ట్‌ 'రుద్రమదేవి స్టార్‌ మా లో జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు ఆరంభమవుతోంది.

ఇది కేవలం మన కథ మాత్రమే కాదు. రానున్న ఎన్నో తరాలు చెప్పుకో దగ్గ కథ. మనం గుర్తుంచుకోదగ్గ కథ. ఎప్పటికీ స్పూర్తినిచ్చే కథ. ఇంతకుముందు ఎన్నడూ బుల్లితెరపై కనిపించని ప్రమాణాలతో..ఈ తరానికి కూడా అందాలన్నదే 'స్టార్‌ మా ప్రయత్నం.

రద్రమదేవి ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/skLfg0BBq7w

Press release by: Indian Clicks, LLC

More News

మారిన కరోనా కాలర్ ట్యూన్..

గత కొన్ని నెలలుగా మన అనుమతి లేకుండానే మన ఫోన్‌లోకి కాలర్ ట్యూన్ చొచ్చుకొచ్చింది. దీనిపై సెటైర్లు, మీమ్స్ అన్నీ ఇన్నీ కావు.

వాట్సాప్‌లో ఇది చూశారా?

కొత్త ప్రైవసీ పాలసీపై ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. మూడు నెలల పాటు దీనిని వాయిదా వేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది.

హీరోయిన్‌గా కంటే విలనిజంపైనే ఆసక్తి చూపుతున్న ముద్దుగుమ్మలు

ఇండస్ట్రీలో లేడీ విలన్స్‌కు ఇంపార్టెన్స్ పెరుగుతోంది. స్టార్ హీరోయిన్లు సైతం విలన్స్‌గా మారి మెప్పిస్తున్నారు.

నాకు కాంపిటిష‌న్ ఎవ‌రో 15 ఏళ్ల త‌ర్వాత అర్థ‌మైంది - రామ్‌

``దేవ‌దాసు’ సినిమాతో 15 ఏళ్ల క్రితం సంక్రాంతి సీజ‌న్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాను. మ‌ళ్లీ ఇప్పుడు ‘రెడ్’ రిలీజ‌యింది.

‘ఆచార్య‌’ సెట్స్‌లోకి రామ్‌చ‌ర‌ణ్‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ‘ఆచార్య‌’ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశాడు.