డ్యాన్స్ టీచర్‌గా రాశి ఖన్నా
Send us your feedback to audioarticles@vaarta.com
జై లవ కుశ, ఆక్సిజన్ చిత్రాలతో ఈ ఏడాది సందడి చేసిన రాశి ఖన్నా.. ప్రస్తుతం టచ్ చేసి చూడు, తొలి ప్రేమ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ముందుగా టచ్ చేసి చూడు ప్రేక్షకుల ముందుకు రానుంది. బెంగాల్ టైగర్ తరువాత రవితేజకి జోడీగా రాశి నటిస్తున్న సినిమా ఇది. ఇందులో మరో హీరోయిన్‌గా సీరత్ కపూర్ నటిస్తోంది.
నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి వెస్ట్రన్ డ్యాన్స్ టీచర్‌గా కనిపించనుందని సమాచారమ్. అయితే ఈ పాత్ర మంచి ఎంటర్‌టైనింగ్ గా ఉంటుందని తెలిసింది. రవితేజ, రాశికి మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా ఉంటాయని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా దుబాయ్‌లో పాటల చిత్రీకరణ పనిలో ఉంది. జనవరి 13న సంక్రాంతి కానుకగా రానున్న ఈ సినిమాపై రాశి భారీ ఆశలనే పెట్టుకుంది. సుప్రీమ్ తరువాత తెలుగులో సరైన విజయం లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments