'రంగుల కల' ప్రారంభం
Monday, June 19, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఎల్.వి.మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం `రంగుల కల` సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. వి.క్రాంతి కుమార్ దర్శక నిర్మాత. తొలి సన్నివేశానికి రాజ్‌కుమార్.ఎం. క్లాప్ కొట్టగా సిద్ధేశ్వర పీఠం స్వామి విశ్వదానంద కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో..రాజ్‌కుమార్.ఎం మాట్లాడుతూ - ``క్రాంతి కుమార్ దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న రంగుల కల. రవీంద్ర తేజ, అక్షర ఈ సినిమాలో హీరో హీరోయిన్స్‌గా పరిచయం అవుతున్నారు. యూనిట్‌కు సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
స్వామి విశ్వదానంద మట్లాడుతూ - ``సినిమాలో నటీనటులు, టెక్నిషియన్స్‌కు సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
దర్శక నిర్మాత వి.క్రాంతికుమార్ మాట్లాడుతూ - ``రవీంద్రతేజ్, అక్షరతో పాటు కొత్త నటీనటులు, ప్యాడింగ్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఇండస్ట్రీలోని పరిస్థితులను తెలియజేసే సినిమా. వరూధిని అనే హీరోయిన్ను ఓ పల్లెటూరులో రైతు కొడుకు ఇష్టపడతాడు. తన అభిమాన హీరోయిన్ను చేరుకుని ఎలా ఆమెను సొంతం చేసుకున్నాడనేదే కథ. జూన్, జూలైలో సినిమా హైదరాబాద్, అమరావతి, కర్ణాటకల్లో షూటింగ్ పూర్తి చేస్తాం. రాజ్‌కుమార్‌గారు తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు`` అన్నారు.
హీరో రవీంద్ర తేజ్ మాట్లాడుతూ - ``స్క్రిప్ట్ వినగానే నచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీలోని ఎలా ఉంటుందో వాటిని ఈ సినిమాలో చూపిస్తున్నాం`` అన్నారు.
అక్షర మాట్లాడుతూ - ``అవకాశం ఇచ్చిన క్రాంతికుమార్‌గారికి థాంక్స్`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments