Tamil »
Cinema News »
ఓ రంగుల చిలుక...పాటకు వస్తున్న స్పందనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా -వర్ధమాన గాయని స్పందన
ఓ రంగుల చిలుక...పాటకు వస్తున్న స్పందనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా -వర్ధమాన గాయని స్పందన
Saturday, October 15, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో తాను పాడిన ఓ రంగుల చిలుక... పాటకు వస్తున్న స్పందన తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని, సింగర్ గా తనన కెరీర్ కి ఈ పాట టర్నింగ్ పాయింట్ అవుతుందని తాను భావిస్తున్నానని వర్ధమాన గాయని స్పందన చెబుతోంది.
శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ కనుమూరి తనే నిర్మిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా. ఈ చిత్రం కోసం ఓ రంగుల చిలుక.. చూడే నీ ఎనకా.. అలుపంటూ లేని ఈ పిల్లడి నడక... అనే పల్లవితో మొదలయ్యే పాటను స్పందన ఆలపించింది. ఓ మళయాళ గీతం గుంచి ప్రేరణ పొంది.. రవిచంద్ర స్వర సారధ్యంలో రూపొందిన ఈ గీతానికి రామాంజనేయులు సాహిత్యం సమకూర్చగా.. కార్తీక్ రోడ్రగ్జ్ రీమిక్స్ చేశారు. ఆడియో గ్యారేజ్ లో మాస్టరింగ్ జరుపుకున్న ఈ గీతాన్ని ఇషిత్ కుబేకర్ మిక్స్ చేయగా.. హరిప్రియ-అశ్విని-షబీనా శివరంజని కోరస్ అందించారు. ఇటీవల ఈ గీతాన్ని ఆవిష్కరించిన ప్రముఖ దర్శకులు సుకుమార్.. ఈ పాట చూసి ఎంతగానో ఇంప్రెస్ అయ్యి.. చిత్ర దర్శకుడు శివరాజ్ కనుమూరి తదుపరి చిత్రాన్ని తన బ్యానర్ "సుకుమార్ రైటింగ్స్"లో నిర్మిస్తానని ప్రకటించారు. ఓ రంగుల చిలుక పాట పాడేప్పుడు.. తన కెరీర్ లో ఇదో మంచి పాట అవుతుందని తాను భావించినప్పటికీ.. ఈ స్థాయి స్పందన మాత్రం తాను ఊహించలేదని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న స్పందన.. ఇంత మంచి పాట పాడే అవకాశం ఇచ్చిన సంగీత దర్శకులు రవిచంద్ర-కార్తీక్ లకు.. దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి, గీత రచయిత రామాంజనేయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
సమైక్యంగా నవ్వుకుందాం అనే ట్యాగ్ లైన్ తో.. దేశవాళీ వినోదం అనే స్లోగన్ తో.. అందరి దృష్టినీ అమితంగా ఆకర్షిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా నవంబర్ విడుదలకు సిద్ధమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments